చిలకలూరిపేట సచివాలయాల్లో మోకాలి లోతు నీరు
కౌన్సిలర్ ఆవేదన!
చిలకలూరిపేట: పట్టణంలోని 27, 28 వార్డు సచివాలయాలు స్వల్ప వర్షానికే మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోవడంపై స్థానిక 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సచివాలయంలోకి నీరు చేరడం వల్ల ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులు చేసుకోవడానికి వీలు లేకుండా పోతుందని ఆయన తెలిపారు. ఈ సమస్యపై గతంలో అనేకసార్లు మున్సిపల్ చైర్మన్‌కు, మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించినప్పటికీ, ఇప్పటివరకు ఎం అధికారులు ఎవరూ స్పందించలేదని చిన్న వర్షానికే సచివాలయంలోకి నీరు ప్రవహిస్తుండడంతో, ఉద్యోగులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, సచివాలయాల్లోకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని లేదా సచివాలయాలను సురక్షితమైన వేరే ప్రాంతానికి మార్చాలని కౌన్సిలర్ శివకుమార్ డిమాండ్ చేశారు.
