పాములేరు వాగు పై వెంటనే బ్రిడ్జి మంజూరు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని మొగరాలగుప్ప గ్రామంలో పాములేరు వాగుపై బ్రిడ్జి మంజూరు చెపిస్తానని ఎన్నికల ముందు ఎమ్మెల్యే జారే ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య తెలిపారు. మండల పరిధిలోని మొగరాలగుప్ప గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారనికై సందర్శించి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, ఎన్నికల ముందు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మొగరాలగుప్ప గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, గ్రామస్తులు వ్యవసాయ పనులకు,పాశువులు మేతకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వర్షాలు కురిసే సమయంలో పనులు ముగించుకుని పశువుల మేతకు వెళ్లిన కాపారులు, వ్యవసాయ కూలీలు ఇంటికి వచ్చే అవకాశం లేక వాగు భీభత్సం తగ్గే వరకు ఆకలితో పెద్ద అడవిలో బిక్కు బిక్కు మంటూ గడుపుతూ గ్రామస్తులు భయం గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారని, వాగులో వారద ప్రవాహం కారణంగా కొన్ని పశువులు కొట్టుకుపోయిన అనేక సందర్భాలు ఉన్నాయని, గ్రామంలో సీసీ రోడ్లు,పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని, వ్యవసాయ పనులకు వెళ్ళేందుకు రోడ్డు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నిమ్మల మధు,గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
