TEJA NEWS

పత్తి పంటకు కింటాకు పది వేలు ఇవ్వాలి : న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో కుంజ కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు ఎస్కే ఉమర్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే పత్తికి కనీస మద్దతు ధర పదివేల రూపాయలు ఇవ్వాలి దళారీలు ప్రభుత్వం కలిసి కనీస ధర ఇవ్వకుండా 5000, 6000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దళారుల చేతులు రైతులు మోసపోతున్నారు. సిసిఐ కేంద్రాలు కూడా ప్రభుత్వం తెరవలేదు వెంటనే ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వమే కింటపత్తికి కనీస మద్దతు ధర పదివేల రూపాయలు ఇవ్వాలని అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇవ్వాలని అఖిల భారత రైతు కూలి సంఘం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసి పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దళారుల దోపిడీలను అరికట్టాలని రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు ముదిగొండ మల్లయ్య, డివిజన్ నాయకులు ఆది నారాయణ, నాగరాజు,మడి చంద్రం,సురేష్, వెంకటేశ్వర్లు రామ్మూర్తి,రమేష్ పాల్గొన్నారు.