అంగన్వాడీ కేంద్రానికి నాలుగు కుర్చీలు అందించిన : మడకం బ్రదర్స్ శ్రీనివాస్, రవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని ముత్యాలంపాడు గ్రామ పంచాయతీలో గల అంగన్వాడి సెంటర్ కు స్థానిక కాంగ్రెస్ నాయకులైన మడకం శ్రీనివాస్, తమ్ముడు మడకం రవి ఆధ్వర్యంలో మంగళవారం రోజున స్థానిక అంగన్వాడి సెంటర్ లో గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సెంటర్ లో కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక రోజున మడకం శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలనుసారం గ్రామపంచాయతీ కార్యాలయము, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించినప్పుడు గర్భిణీ స్త్రీలు కూర్చోవడానికి కుర్చీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని చూసి సమయంలో అంగన్వాడి టీచర్ కుర్చీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మాకు ఒక నాలుగు కుర్చీలో సహాయం చేయగలరని చెప్పడం జరిగింది. నేడు మడకం బ్రదర్స్ ఆధ్వర్యంలో ముత్యాలంపాడు అంగన్వాడి బిల్డింగ్ కి గర్భిణీలు కూర్చోవడానికి సహాయం అందించడం జరిగినది అని మడకం బ్రదర్స్ శ్రీనివాస్ రవి తెలిపారు. ఇలాంటి సహాయాలు మరెన్నో చేయాలి అని గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు.
