సింగరేణి లో వయో పరిమితి పెంపు

సింగరేణి లో వయో పరిమితి పెంపు

TEJA NEWS

Increase in age limit in Singareni

సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకాల వయోపరిమితిని 40 ఏండ్ల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వయోపరిమితి సడలింపు కోసం సింగరేణి కార్మిక కుటుంబాలు చాలా ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అంశాన్ని పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు.

ఆ మేరకు గతంలో 35 ఏండ్ల వరకే పరిమితి ఉండ గా, తాజాగా 40 ఏండ్ల వరకు వయోపరిమితి సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల సంస్థలో దాదాపు 300 మందికి ప్రయోజనం చేకూరుతుం దని సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ బలరాం నాయక్‌ తెలిపారు.

సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో మెడికల్‌ అన్‌ఫిట్‌,ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియా మకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు.

గతంలో 18 నుంచి 35 ఏండ్లలోపు వారినే కారుణ్య నియామకాల కింద తీసు కునే వారు. కరోనా కాలంలో రెండేండ్లు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచు తూ నిర్ణయం తీసుకు న్నారు.

ఈ ఉత్తర్వులను 2018 మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తామని సీఎమ్‌డీ బలరాం నాయక్‌ వివరించారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS