TEJA NEWS

శంకర్‌పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామ బిజెపి పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీత వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, పీసీసీ సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాష్, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, మండల, మున్సిపల్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.


TEJA NEWS