TEJA NEWS

మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా గారి కుమార్తె “అన్షు మాలిక” కు అంతర్జాతీయ అవార్డ్!

నైజీరియా దేశం లాగోస్‌లో జ‌రిగిన “గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివ‌ల్‌”లో సోష‌ల్ ఇంపాక్ట్ కేట‌గిరీలో “బెస్ట్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డు”ను సాధించిన అన్షు మాలిక!

20 ఏళ్ల వ‌య‌సులోనే అరుదైన ఘ‌న‌త‌!
అతి చిన్న వయస్సులో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సోషల్‌సర్వీస్ అవార్డులను (30 కి పైగా) అందుకొన్న భారతీయురాలిగా రికార్డ్!

అన్షుమాలిక కంటెంట్ క్రియేట‌ర్‌గా, కంటెంట్ రైట‌ర్‌గా, డెవ‌ల‌ప‌ర్‌గా, సామాజిక కార్య‌క‌ర్త‌గా అనేక విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
7 ఏళ్ల వ‌య‌సులోనే అనేక సాంకేతిక‌త‌ను అల‌వాటు చేసుకున్న అన్షు ఆ వ‌య‌సులోనే కోడింగ్ నేర్చుకుంది. అందులోనూ ప్రపంచ రికార్డును సాధించింది.
త‌న 16-17 ఏళ్ల మ‌ధ్య “ఫేస్ రిక‌గ్నిషన్ బాట్ యూసింగ్ డీప్ ల‌ర్నింగ్” అనే విభాగం గురించి ఏకంగా థీసిస్ రాసింది. ఆమె రాసిన ఈ థీసిస్ రీసెర్చ్ గురించి అంత‌ర్జాతీయ మీడియా సైతం క‌థ‌నాలు ప్ర‌చురించింది.
ఆమెత‌న 12వ తరగతిలో 10 GPA సాధించి కంప్యూటర్ సైన్స్‌ను అభ్యసించడానికి బ్లూమింగ్టన్‌లోని ఇండియానా విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడా ఉత్తమ విధ్యార్థిగా పలు అవార్డులను గెలుచుకొంది.
“ఫ్లేమ్ ఇన్ మై హార్ట్” పుస్తకాన్ని రచించి ఉత్తమ యువ రచయిత్రిగా అవార్డును అందుకొన్నారు.
పేద ప్రజల ఆర్థిక సహాయం కోసం “లాభాపేక్షలేని యువపారిశ్రామిక వేత్త” గా పలు అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు అందుకొన్నారు.
ఆఫ్రికన్ దేశాల విద్యార్థులకు రేడియో, టివి & ఇంటెర్నెట్ ద్వారా, 50కి పైగా వివిద ప్లాట్ ఫార్మ్ ల ద్వారా ఉచితంగా విద్యను భోధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో “బెస్ట్ యంగ్ సోషల్‌ సర్వీస్ పర్సన్” అవార్డులను అందుకొన్నారు.
యూరప్ & ఆఫ్రికా దేశాలకు చెందిన వివిద ప్రతిష్టాత్మక మ్యాగజైన్లు తమ కవర్ పేజీపై అన్షుమాలిక ఫోటోలు ప్రచురించి గౌరవించింది.
ఇంగ్లాండుకు చెందిన పలు పత్రికలు “క్వీన్ ఆఫ్ టాలంట్” అని పొగుడుతూ తొలిపేజీలో ఆమె గొప్పతనాన్ని ప్రచురించడం‌ జరిగింది.
ఇలా పలు అవార్డులు రివార్డులతో భారతీయ యువత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్న అన్షుమాలిక అభినందనీయురాలు! ఆమె మన రోజమ్మ పుత్రిక కావడం మనందరికీ గర్వకారణం!


TEJA NEWS