TEJA NEWS

కుత్బుల్లాపూర్ లో ఘనంగా అంతర్జాతీయ మత్సకారుల దినోత్సవ వేడుకలు….

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

కుత్బుల్లాపూర్ చౌరస్తాలో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ తాను అసెంబ్లీ సమావేశాలలో ముదిరాజులను బిసి-డి నుంచి బిసి-ఏ లోకి మార్చాలనే ముఖ్యమైన డిమాండ్ ను ఇప్పటికే ప్రస్తావించడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా ముదిరాజ్ ల అభివృద్ధి, అభ్యున్నతి కోసం తాను శాయశక్తుల కృషిచేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అడ్వకేట్ కమలాకర్, ఆటో బలరాం, నదీమ్ రాయ్, విజయ్ హరీష్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గుమ్మల స్వామి, సభ్యులు కోలా రవీందర్ ముదిరాజ్, గుమ్మడి మధుసూదన్ రాజు, తోడేటి సత్యం ముదిరాజ్, ఆర్. రమేష్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్, ఉమారాణి ముదిరాజ్, కృష్ణవేణి ముదిరాజ్, గుమ్మల నరేందర్ ముదిరాజ్, శివకుమార్ ముదిరాజ్, కుంట వేణు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS