అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం

TEJA NEWS

International Yoga Day

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని * మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమిషనర్ రామకృష్ణరావు తో కలసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్ లో ప్రగతి యోగ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధనను సాధించడానికి పురాతన మార్గమని ప్రధానంగా భారతదేశంలో ‘యోగ’ అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించిందని, యోగా అనేది మనిషి తన మనస్సు, శరీరం మరియు ఆత్మను ఒకచోట చేర్చడానికి ప్రయత్నించే ప్రక్రియని, అందరూ ప్రతీ రోజు యోగ చేయాలని,ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల ప్రసన్న జగదీష్ యాదవ్,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,ప్రగతి యోగ సెంటర్ మాస్టర్ మాటం మల్లేష్,ఇతర ముఖ్య సభ్యులు,NMC ఆయా విభాగాల అధికారులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి