Spread the love

భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం.

కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డు లోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువ మరమ్మత్తులు చేయనుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల బైపాస్ రోడ్డులోని ఎస్.కే.ఫాస్ట్ ఫుడ్ సమీపంలోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజి రావడం జరిగింది. ఈ పైప్ లైన్ పూర్తి తవ్వి మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు సుమారు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈ ఐదు రోజులపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. కావున వాహన చోదకులు, ప్రజలు సహకరించాలని కమిషనర్ ఆ ప్రకటనలో కోరారు. ఈ మరమ్మత్తు పనులను పోలీసు అధికారులతో కలసి మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ. లలిత పర్యవేక్షిస్తున్నారు.