ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

TEJA NEWS

Introduction of English medium in government school and corporate level education without distinction between rich and poor

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వంకృషి………. రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి

త్వరలో మెగాడీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టుల భర్తీ

వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో
పేద ధనిక అనే తారతమ్యం లేకుండా విద్యార్థులు అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళుతుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి అన్నారు.
బుధవారం నుండి పునఃప్రారంభమైన విద్యాలయాల్లో పండగ వాతావరణం కల్పించే విధంగా మామిడి తోరణాలు, కొబ్బరి మాటలతో కళకళలాడుతుండగా విద్యార్థులు నూతనోత్సాహంతో బడిలో అడుగులు పెట్టారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం వనపర్తి జిల్లా అంతట వేడుకగా ప్రారంభం కాగా గోపాల్ పేట మండలంలోని జయన్న తిర్మలాపూర్, మున్ననూర్, తాడిపర్తి, గోపాల్ పేట, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డా. జి. చిన్నా రెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరు జయన్న తిర్మలాపూర్ కావడంతో ప్రభుత్వ ప్రాథమికొన్నత పాటశాల తిర్మలాపూర్ కు మొదట గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు తమ పిల్లలను ఆంగ్లమాధ్యమంలో కాన్వెంట్ పాఠశాలల్లో చదివిస్తారని, పేద కుటుంబం వారు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో నే చదివిస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా వాటిలో సైతం క్రమంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేషపెడుతూ, అన్ని మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలకు కల్పించి కార్పొరేట్ స్థాయి విద్యను పేద పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత 10 సంవత్సరాల్లో విద్యాలయాల్లో సరైన వసతులు, ఉపాద్యాయులు లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు కల్పించి మునుపెన్నడూ లేని విధంగా పాఠశాలల పునఃప్రారంభం అయ్యే నాటికే విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. మరి కొన్ని రోజుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చే విధంగా ప్రణాళికలు చేస్తుందన్నారు.
త్వరలోనే మెగా డిఎస్సీ నిర్వహించి 11 వేల ఉపాధ్యాయులను నియమించనున్నట్లు తెలిపారు.
తీర్మలాపూర్ లో ప్రస్తుతం ఉన్న పాఠశాలకు అదనంగా మరో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తానని, కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు . తిర్మలాపూర్ గ్రామంలో ఒక పెద్ద కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపడతామని తెలియజేశారు. గ్రామంలో మరో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, ఏకరూప దుస్తులు అందజేసారు. పిల్లలు బాగా చదువుకోవాలని, దాదాపు మూడు పూటలు భోజనం పాఠశాలలోనే అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నందున అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే పేర్లు నమోదు చేయించుకొని నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు. పాఠశాలకు మొదటి రోజు హాజరైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.
కౌరవుల అందరిపేరు సునాయాసంగా చెప్పిన 4వ తరగతి విద్యార్థిని నయొమి
తిర్మలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న నాయోమీ విద్యార్థిని కౌరవుల 100 మంది పేర్లను గుక్కతిప్పుకోకుండ సునాయాసంగా చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది. వందమంది పేర్లు ఏకధాటిగా చెప్పెడడంతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు విద్యార్థిని నయొమీ ని శాలువాతో సత్కరించారు.
అనంతరం మున్ననుర్, తాడిపార్తి, గోపాల్ పేట పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను అందజేసారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, డి. ఈ, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, గోపాల్ పేట ఎంపీడీఓ శంకర్, ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాస్, మున్నానుర్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్, ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అదేవిధంగా మున్ననూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సైతం అదనపు గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
తిర్మలాపుర్ లో స్కూల్ డే ఘనంగా నిర్వహించారని కొనియాడారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS