భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం…
…..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణము, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణము మరియు జాతరలో ముఖ్య అతిధిలుగా పాల్గొనాలని కోరుతూ భౌరంపేట్ గ్రామ BRS నాయకులు మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు కి మరియు MLA కేపీ. వివేకానంద కి ఆహ్వాన పత్రికలను అందచేసారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , బల్వంత్ రెడ్డి , యాదగిరి , నాగరాజు , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.