TEJA NEWS

జగన్ ను కేటీఆర్ ఫాలో అవుతున్నారా…?

పులివెందుల ఎమ్మెల్యే జగన్ తరహాలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. యాదృచ్చికమో, క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకో కానీ కేటీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు జగన్ వ్యాఖ్యలను తలపిస్తున్నాయి. అధికారం కోల్పోయాక పార్టీ నేతల సమావేశంలో జగన్ మాట్లాడుతూ…ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతాయని, మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇంకో నాలుగేళ్లు అవుతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు.

పార్టీ నేతలకు నమ్మకం కలిగేందుకు ఓ అడుగు ముందుకేసి ..నాలుగేళ్ల తర్వాత శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చుతామని, సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడుతామంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వరుస ఎదురు దెబ్బలతో నిస్తేజంగా మారుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తున్నారు. అందుకే పార్టీని చక్కదిద్దేందుకు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ పర్యటనకు వెళ్తున్నారు. ఇవి ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయో కానీ బీఆర్ఎస్ వచ్చే నాలుగేళ్ల నాటికి ఇప్పుడున్నంత స్ట్రాంగ్ గా ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి. అయినా కేటీఆర్ మాత్రం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, జగన్ తరహాలో బిల్డప్ ప్రకటనలు చేస్తుండటంతో..జగన్ ను కేటీఆర్ ఫాలో అవుతున్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది.


TEJA NEWS