TEJA NEWS

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలనా అంటే?: కేటీఆర్‌

పోలీసు బందో బ‌స్తు మ‌ధ్య‌ మాజీ స‌ర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి అంతిమయాత్ర‌

ఆఖ‌రికి అంతిమయాత్ర‌పై కూడా ఆంక్ష‌లు విధించారంటూ కేటీఆర్ మండిపాటు

‘ఎక్స్’ వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి విసుర్లు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా వంగూరు మండ‌లం కొండారెడ్డిప‌ల్లికి చెందిన మాజీ స‌ర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకోగా, ఆయ‌న అంతిమయాత్ర జ‌రిగింది. భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఈ అంతిమ‌యాత్రం సాగింది. అంతిమయాత్ర‌పై కూడా ఆంక్ష‌లు విధించారంటూ రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా నిప్పులు చెరిగారు.

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలనా అంటే? అని నిల‌దీశారు. ఒక మాజీ సర్పంచ్, 85 ఏళ్ల‌ పెద్ద మనిషి ఇంటికి అడ్డంగా గోడ కట్టి తొవ్వ లేకుండా చేశారు. ఎంతో క్షోభ పెట్టి, ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టారు. ఆఖరికి అంతిమ యాత్రకు కూడా ఆంక్షలు పెట్టడం ఏంటి? అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


TEJA NEWS