కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్.
సీపీఐ సభ్యత్వ పునరుద్ధరణ సమావేశం నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్,సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్జువా పార్టీలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్య వస్తాయని, ఆయా పార్టీల నాయకులు ఇన్సూరెన్స్ పేరు చెప్పి సభ్యత్వం చెపిస్తాయని కానీ సీపీఐ పార్టీ మాత్రం ఎలాంటి ఆశలు చూపకుండా కచ్చితంగా లేవి కట్టితేనే సభ్యత్వం ఇస్తుందని అలాంటి నియమ నిబద్ధత కలిగి సభ్యత్వం తీసుకోవడం చాలా గొప్ప అని అలాంటి పార్టీ కార్యకర్తలుగా కొనసాగడం గర్వ పడాల్సిన విషయమని అన్నారు.
ఎన్నికల్లో బీజేపీ మతం దేవుడు పేరు తప్ప నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని కానీ,ప్రజలకు భారమవుతున్న టాక్స్ ను తగ్గిస్తామని కానీ,ఉద్యోగం కల్పిస్తామని కానీ చెప్పకుండా కేవలం రాముడు,మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాముడి గుడి కట్టామని గొప్పలు చెపుతున్న మోడీ మీడియా అది బాబ్రీ మస్జీద్ కూల్చిన 3 కిలోమీటర్ల పక్కన కట్టి ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసివేసి సనాతన ధర్మం పేరిట ప్రజలను బానిసలుగా చూసే ప్రమాదం పొంచి ఉందని కావున వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడానికి సీపీఐ కార్యకర్తలు పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాము,శాఖ సభ్యులు జార్జ్,సుంకిరెడ్డి, నర్సింహారెడ్డి, కనకయ్య,శ్రీనివాస్,గురప్ప, కరుణాకర్,శేఖర్,సత్తిరెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు