TEJA NEWS

It is the culture of Telangana to measure goddesses by offering Bonalas and organizing fairs

బోనాల సమర్పణ, జాతరాలను నిర్వహిస్తూ అమ్మవారిని కొలవడం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
……………………………………………………….
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలకు
కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ బోనాల సమర్పణ, జాతరాలను నిర్వహించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలు మనపై సంపూర్ణంగా ఉంటాయని నమ్ముతూ తెలంగాణ ప్రజలు అమ్మవారికి వేడుకలు నిర్వహిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జక్కుల విజయ శ్రీనివాస్ యాదవ్, దాసరిపల్లి ఆనంద్, ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, దేవాలయ చైర్మన్ ఈదులకంటి నరసింహ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బిక్షపతి గౌడ్, తురాయి పాండుగౌడ్, డైరెక్టర్ ఈదులకంటి యాదయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఈదుల కంటి శ్రీనివాస్ గౌడ్, ఎం. సుధాకర్ గౌడ్, ఎల్. అరుణ్ గౌడ్, నర్సింగ్ రావ్ గౌడ్, ఎం. జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS