గ్రామాలల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా చూసే బాధ్యత అధికారులు తీసుకోవాలి
- భూపతి ప్రవీణ్
బిజెపి మండల ప్రధాన కార్యదర్శి
కమలాపూర్:
కమలాపూర్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో విష జ్వరాలు డెంగ్యూ మలేరియాలతో అల్లాడిపోతున్నాయని కమలాపూర్ మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు ప్రతి పల్లెలల్లో పర్యటనలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించి ఎలాంటి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్ అన్నారు. జిల్లా ఉన్నత వైద్యాధికారులు వెంటనే కమలాపూర్ మండలాన్ని సందర్శించి కావలసిన వైద్య సదుపాయాలను డెంగ్యూ కిట్లను డెంగ్యూ పరీక్ష చేసేందుకు సరిపడా సౌకర్యాలను కల్పించాలని పల్లె వైద్యులు ఉదయమే 9 గంటలకు ఆ గ్రామాలకు చేరుకొని నిత్యం వైద్య పరీక్షలు చేస్తూ వీలైనంత ఎక్కువగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ అప్రమత్తంతో ప్రజలు విష జ్యరాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత డాక్టర్లపై ఉంది కాబట్టి ఉదయమే ఆయా గ్రామాలకు చేరుకొని పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు.
పల్లె డాక్టర్లు ఏ గ్రామంలో అయితే పనిచేస్తున్నారో ఆ గ్రామాల్లో మాత్రమే పని చేయాలని ఉన్నతాధికారులు వేరే గ్రామాలకు డ్యూటీ వేయకుండా ఆ గ్రామంలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా ఉన్నత వైద్యాధికారులు ప్రతిరోజు కమలాపూర్ మండలాన్ని సమీక్షిస్తూ ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ తెప్పించుకొని వైద్యుల పనితీరు సమీక్షిస్తూనే విష జ్వరాల నుండి కమలాపూర్ మండల ప్రజలందరినీ కాపాడాలని విజ్ఞప్తి చేస్తూన్నామని అన్నారు. అదే విధంగా ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ఒకవేళ అలసత్వం వహిస్తే గ్రామస్థాయి మరియు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పనితీరు బాగోలేని వైద్యాధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ పరిధిలో సరైన శానిటేషన్ చేసి పరిసరాలు పరి శుభ్రంగా ఉంచే విధంగా గ్రామ సిబ్బంది కూడా శ్రద్ధతో పని చేయాలని అన్నారు.