TEJA NEWS

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాంట్ కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులతో వరి ధాన్యం కొనుగోలు అంశం పైన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపైనా అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

మహబూబ్ నగర్ లో జరగనున్న ప్రజా విజయోత్సవాలు- రైతు పండగ మహా సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడే ప్రసంగాన్ని జగిత్యాల జిల్లా లోని 18 మండలాల రైతు వేదికల వద్ద ఏర్పాటు చేయనున్న డిజిటల్ స్క్రీన్ ద్వారా రైతులు చూడవచ్చని ,ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1 లక్ష 26 వేల 890 మెట్రిక్ టన్నులకి పైగా వరి ధాన్యాన్ని ఐకెపి, సొసైటీ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని,దానికి సంబంధించి 27వేల 530 కి పైగా రైతుకు సుమారు 433 కోట్ల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, సుమారు 2148 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగొలు చేయడం జరిగిందని దానికి సంబంధించిన బొనస్ 3 కోట్ల 16 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని

,ఇప్పటివరకు సన్న రకం వడ్లకు సంబందించిన 377 కోట్ల రూపాయలను మరియు దొడ్దు రకం వడ్లకు సంబందించిన 438 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని,జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులు ఎక్కడ రైతుకు చిన్న పాటి ఇబ్బంది లేకుండా మిల్లర్ల నుండి తాలు తప్ప అనే దోపిడీ లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని,ఇప్పటి వరకు 72వేల 1వంద మంది రైతులకు 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేయడం జరిగిందని,కొన్ని సాంకేతిక కారణాల వల్ల 19 వేల 464 మంది రైతులకు రుణాలు మాఫీ జరగలేదని వారి విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం జరిగిందని వారికి సంబంధించిన రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని,రాష్ట్ర ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ప్రకటించడం ద్వారా రైతులు సన్న రకం వడ్ల సాగుపై ఎక్కో దృష్టి సారించడం జరిగిందని, మిల్లర్లె నేరుగా రైతుల వద్దకు వెల్లి అదంగా డబ్బులు ఇచ్చి సన్న రకం వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని,కొన్న వడ్లకు కూడా ట్రక్ షీట్ ను ఇవ్వడం జరుగుతుందని,దాని ద్వారానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.


TEJA NEWS