TEJA NEWS

జగిత్యాల మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి జాతీయస్థాయి కరాటే కుంగ్ పోటీలకు ఎంపిక.


తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల జగిత్యాల బాయ్స్ 1.
రాష్ట్రస్థాయిలో జరిగినటువంటి కరాటే కుంగ్ ఫు నేషనల్ ఛాంపియన్షిప్ 2024 లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల, MPC ఫస్టియర్ చదువుతున్న అయానుద్దీన్ కరాటే, కుంగ్ఫులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమానికి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి చిత్రు ముఖ్య అతిథిగా హాజరై ఆయానుద్దీన్ సన్మానించి అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ మహేందర్, మరియు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేందర్ విద్యార్థిని అభినందించారు. మొదటి స్థానం సాధించడానికి కారణమైన కోచ్ జవేరియా కానం ను అధికారులు సన్మానించి అభినందించారు. జిల్లా సంక్షేమ అధికారి చిత్రు విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా రాష్ట్రస్థాయిలో క్రీడలలో రాణించాలన్నారు. ప్రతి విద్యార్థికి విద్య ఎంత ముఖ్యమో అదేవిధంగా శారీరక దృఢత్వం కూడా అంతే ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS