జై భీమ్.. ప్రపంచ మేధావికి జోహార్లు..!!
భారత రాజ్యాంగ రూపశిల్పి “డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ” 68 వ వర్థంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ PJR నగర్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఆ మహనీయునీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన PAC చైర్మన్ అరెకపూడిగాంధీ .
ఈ సందర్భంగా గౌరవ PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లడుతూ శ్రీ డా. బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్బంగా ఆహా మహనీయుడికి ఘన నివాళ్ళర్పిస్తున్నాం అని , అదేవిదంగా రాజ్యాంగ సృష్టి కర్త మరియు మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారత రాజ్యంగ నిర్మాత, ఆర్థిక వేత్త ,న్యాయ కోవిందుడు, రాజనీతిజ్ఞుడు,ప్రపంచ మేధావి ,దేశానికి దశ ,దిశ చూపిన మహానుభావుడు, ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక రోల్ మోడల్ అని,సమానత్వం కోరకు,అందరికి సమానత్వం ఉండాలని,అంటరానితనం,అసమానతలు, వివక్షాల పై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు,కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని,డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది.చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే.
పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారు దేశం కోసం ఎంతో కృషి చేశారని, రాజ్యాంగం రాసి నవ భారత నిర్మాణ అధ్యడు అని, ,ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందుతున్నావంటే అది బి ర్ అంబెడ్కర్ మనకు కలిపించిన హక్కు అని ,దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగాని రచించిన మేధావి ,ఆయన ఆశయాలను ,ముందుకు తీసుకుపోయి భవిషత్తు తరాలకు తెలియచెయ్యాల్సిందిగా మనఅందరి బాధ్యత అని ఆయన ఆశయాలను సాధిద్దాం అని, అందుకు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం ,స్ఫూర్తిదాయకం అని, ఆయన చూపిన బాటలో యువత పయనించాలని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలోయువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, పాండు గౌడ్, జిల్లా గణేష్, శివరాజ్ గౌడ్, జి.రవి, మరేళ్ల శ్రీనివాస్, అష్రఫ్ , CH. భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, యాదగిరి, అగ్రవాసు, బాలస్వామి, మల్లేష్, మోజెస్, ముజీబ్, మహేష్, నరసింహులు, రవీందర్, మజర్, బషీర్, ఖలీమ్, ఇంతియాజ్, సాయి, దనుంజయ్, ప్రసాద్, నరసింహులు, రాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.