వైసీపీ చేసిన అక్రమాలకు జైలు లు సరిపోవు” – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
వైసీపీ ప్రభుత్వం కాలంలో జరిగిన
అక్రమాలు అంత స్థాయిలో ఉన్నాయంటూ, వాటికి జైల్సే సరిపోవని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.
తన కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాలుగో వారంలో నిర్వహించిన మహిళల గ్రీవెన్స్ కార్యక్రమం.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ —
“గుంటూరు నగరంలో శానిటేషన్, పైప్‌లైన్ వంటి మౌలిక సదుపాయాల సమస్యలతో పాటు కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తిస్తున్నాం. చాలా మంది మహిళలు తమ సమస్యలను అక్కడ చెప్పుకోలేక ఇక్కడికి వచ్చి మనతో పంచుకుంటున్నారు,” అన్నారు.
పేదల బియ్యంపై దళారుల దోపిడి… సహించేది లేదు!
మా పేర్లు వాడుకొని రేషన్ షాపులు అక్రమాలు చేయడం అసహ్యం. పేదల నోటి వాకిలి నుంచి బియ్యం లాగేసే ఈ దళారుల పన్నాగాలను ఇక సహించం. ప్రభుత్వమే పేదలకు ఉచితంగా లేదా తక్కువ ధరకే ఇస్తున్న బియ్యం, సరుకులు కొందరి చేతుల్లో సొమ్ముగా మారుతున్నాయి.
పాలన పారదర్శకంగా ఉండాలి, లబ్ధిదారుల హక్కులు కాపాడాలి. కానీ కొంతమంది రేషన్ డీలర్లు, మధ్యవర్తులు పేదల రేషన్ కార్డులను వాడుకొని, రేషన్ బియ్యం మరియు సరుకులపై దోపిడి చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం ..
“పేదల బియ్యం దోచుకునే వారిని వదిలేది లేదు!” — ప్రజల హెచ్చరిక.
ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో 100కి పైగా వినతులు అందాయని, అందులో 75% పైగా సమస్యలకు పరిష్కారం చూపించామనీ ఆమె తెలిపారు.
ప్రతి చిన్న సమస్యను కూడా ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
