పల్నాడు జిల్లా గురజాల శ్రీ పాత పాటమ్మ దేవాలయంలో ప్రతి వచ్చు భక్తులకు వృద్ధులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ,ఈవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ గురజాల నగర పంచాయతీ కమిషనర్ శివన్నారాయణ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు , ఈ అన్నదాన కార్యక్రమానికి గురజాల పట్టణానికి చెందినటువంటి కొప్పు రావూరి సతీష్ సుప్రియ కార్తీక మాసం సందర్భంగా అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు, అదేవిధంగ స్మైల్ ఫౌండేషన్ కు నయన్ బాబా ఆర్థిక సహాయం అందజేశారు ,ఈ సందర్భంగ గురజాల స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అలానే స్మైల్ ఫౌండేషన్ గురజాలలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, స్మైల్ ఫౌండేషన్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, , ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి , నెంబర్ గుండా సైదారావు పాల్గొన్నారు,
