TEJA NEWS

చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం రోడ్డు నందు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం లో పాల్గొనవలసినదిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని ప్రత్యేక ఆహ్వానించిన వూసా శ్రీహరి స్వామి మరియు శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం…

ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ చే రంగారావు గురుస్వామి శ్రీ అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహనికి అత్యంత ప్రీతి పాత్రమైన పాలాభిషేకం, నెయ్యీభిషేకం ఇలా పలు రకాల అభిషేకాలు చేయించారు.
KV రంగారావు గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ స్వామి వారి యొక్క విశిష్టతను, వైభవాన్ని ఇక్కడి ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో అత్యంత వ్యయ ప్రయాసలు ఓర్చి ఈకార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఎంతోమంది భక్తులు శబరిమలై వెళ్లి అక్కడ స్వామివారికి జరిగే అభిషేకాలు, పూజా కైంకర్యాలను చూడాలని కోరిక ఉంటుంది.ముఖ్యంగా మాతృమూర్తులకు మరికొందరికి ఆ అవకాశం లేక బాధపడుతూ ఉంటారు. వారందరి కోరిక తీరాలనే ఉద్దేశంతో భగవంతుడే మీ ముందుకు వచ్చాడని అన్నారు.శబరిమలై లో ఎలా అయితే పూజలు,అభిషేకాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ స్వామి వారికి చేసి చూపించి ఇక్కడ భక్తులకు ఆ అనుభూతి కలిగించడమే ఈ కార్యక్రమ నిర్వహకులు శ్రీహరి స్వామి ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
గుత్తికొండ కోటేశ్వరరావు స్వామి మరియు వారి బృందం వారిచే గొప్ప భజన కార్యక్రమం చేయడం జరిగింది ఈ భజన కార్యక్రమంలో స్వామి మాల ధరించిన భక్తులందరూ పరవశించి నృత్యాలు చేస్తూ కరతాళ ధ్వనులతో స్వామివారిని ఘనంగా కీర్తించారు.
ముందుగా వారి ఆహ్వానంపై ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కి శ్రీహరి స్వామి, అయ్యప్ప భక్త బృందం, తియ్యగూర ఈశ్వర్ రెడ్డి , లింగాల విజయ యాదవ్ ,నరేంద్ర రెడ్డి ,కళ్యాణ్ MK తదితరులు ఘన స్వాగతం పలికారు.
వారి ఆహ్వానాన్ని మన్నించి శ్రీ అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమానికి విచ్చేసినందుకు మర్రి రాజశేఖర్ కి కృతజ్ఞతలు తెలియజేసి స్వామివారి పట్టు వస్త్రాలను అందించిన వూసా శ్రీహరి స్వామి, తియ్యగూర ఈశ్వర్ రెడ్డి , లింగాల విజయ యాదవ్ …