తేమశాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టాలి : ఏఈఓ లింగయ్య
నకిరేకల్ : రైతులు తేమ శాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని ఏఈఓ లింగయ్య అన్నారు. నకిరేకల్ సమీపంలో గల నోముల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం లో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యంలో ఎటువంటి తాలు,మట్టి పెళ్లలు లేకుండా కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉండే ఉదంగా ధాన్యాన్ని ఆరబెట్టి గిట్టుబాటు ధరను పొందాలని, సన్న ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని తెలియజేశారు.
