జగన్ రైతుల నమ్మకానికి అనర్హుడు.. రాష్ట్ర అమ్మకానికి, వ్యవసాయ భూముల దోపిడీకి మాత్రమే అర్హుడు : మాజీమంత్రి ప్రత్తిపాటి
….
- రైతులు, వ్యవసాయం గురించి జగన్ మాట్లాడుతుంటే నాగలి నవ్వుతోంది.. నేలతల్లి బోరుమంటోంది : ప్రత్తిపాటి
- బురదలో కాలుపెట్టకుండా పొలాల్లో సెట్టింగులు వేయించినప్పుడే వ్యవసాయంపై జగన్ కు చిన్నచూపని అర్థమైంది : ప్రత్తిపాటి.
- చంద్రబాబు నాయకత్వ పటిమతో ఏపీకి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలతో జగన్ లో పైశాచికత్వం అధికమవుతోంది. : ప్రత్తిపాటి
“ ఏనాటికీ.. ముమ్మాటికీ రాష్ట్ర రైతాంగం అభిమానం. నమ్మకానికి జగన్ అనర్హుడు.. రాష్ట్ర అమ్మకానికి, వ్యవసాయ భూముల దోపిడీకి మాత్రమే జగన్ అర్హుడు. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల తాకట్లు, అమ్మకాలే అందుకు నిదర్శనం. రైతుల పేరిట రాజకీయ డ్రామాలు.. ప్రభుత్వంపై విమర్శలు జగన్ పెయిడ్..ఫేక్ పాలిటిక్స్ లో ఒక అధ్యాయం మాత్రమే. నమ్మి గెలిపించిన జనాన్ని మోసగించి, కల్తీమద్యం.. వనరుల దోపిడీతో వేలకోట్లు దోచేసిన జగన్.. తన పార్టీవారిని రైతులు, వ్యవసాయం గురించి జగన్ మాట్లాడుతుంటే నాగలి నవ్వుతోంది.. నేలతల్లి బోరుమంటోంది.
బురదలో కాలుపెట్టకుండా పొలాల్లో సెట్టింగులు వేయించినప్పుడే వ్యవసాయంపై జగన్ కు చిన్నచూపని అర్థమైంది. చంద్రబాబు నాయకత్వ పటిమతో ఏపీకి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలతో జగన్ లో నానాటికీ పైశాచికత్వం పెరుగుతోంది. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గి, ప్రభుత్వం ప్రజల్ని ఆదుకున్నాక జగన్ కు రాష్ట్రం గుర్తురావడం దానిలో భాగమే. రైతులు నష్టపోయారని గొంతుచించుకుంటున్న జగన్.. ముందు తన ప్రభుత్వంలో సంభవించిన విపత్తుల నష్టానికి ఎంతమేర రైతులకు సాయం చేశాడో, ఎన్ని కుటుంబాలను ఆదుకున్నాడో సమాధానం చెప్పాలి.
అధికారంలో ఉన్నప్పుడు రైతుసంక్షేమానికి మంగళం పాడి…. నేడు రాజకీయ విమర్శలా?
అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి మేలు చేసే పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టులనిర్వీర్యం.. ఉచితవిద్యుత్…. డ్రిప్ఇరిగేషన్.. మద్ధతుధర.. పంటలబీమా..ఇన్ పుట్ సబ్సిడీలకు మంగళం పాడిన జగన్.. నేడు స్వప్రయోజనాలతో రైతుల పేరుతో రాజకీయ విమర్శలు చేస్తున్నాడు. మొంథా తుపాను నష్టపరిహరం పొందే రైతుల ఉత్పత్తులు ప్రభుత్వం కొనదనేది కేవలం వైసీపీ..సాక్షి మీడియా దుష్ప్రచారమే. రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసి, వారిని రెచ్చగొట్టాలన్నదే అవినీతి మీడియా కుట్రపూరిత ఆలోచన. తుపాన్ల నష్టం కంటే పరామర్శల పేరుతో జగనే ఎక్కువ నష్టం చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టించలేని నాయకుడు తమకేం మేలు చేస్తాడంటున్నారు. హెక్టారుకు ఎన్ని ఎకరాలో, ఆలుగడ్డేదో – ఉల్లిగడ్డేదో, కిలో పొగాకు ధరెంతో తెలియని జగన్ ను నమ్మి మరోసారి మోసపోమంటున్నారు. తన పాలనలో సంభవించిన ప్రకృతి విపత్తులతో జరిగిన పంటనష్టానికి జగన్ ఎంతమేర రైతుల్ని ఆదుకున్నాడో, ఎందరికి ఆర్థికసాయం చేశాడో చెప్పాలంటున్నారు.
జగన్ నైజానికి భిన్నం.. అన్నదాతల పరామర్శ
తన నైజానికి భిన్నంగా ‘అన్నదాతలకు అండగా’ అంటూ జగన్ ప్రదర్శించిన వీధినాటకం రక్తి కట్టక వైసీపీ శ్రేణులు డీలాపడ్డాయి. అవినీతిపరులు, దోపిడీదారులు, క్రిమినల్స్, డెకాయిట్స్ కు అండగా నిలవాలిగానీ, తనకు సూటుకాని వేషాలెందుకంటున్నాయి. తాడేపల్లిలో ప్రారంభమైంది మొదలు మచిలీపట్నం చేరేవరకు రోడ్డుప్రయాణాన్ని కావాలనే జాప్యం చేసినా, ప్రజలు వైసీపీ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడంతో వైసీపీ నేతలు తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల పరామర్శ డ్రామాలు అభాసుపాలైనా అన్న వైఖరి మారదా అని వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. రెడ్ కార్పెట్లు.. పోలీస్ పహారాలు..పరదాలు.. భారీ స్టేజ్ లు, కూలీ అభిమానుల కుప్పిగంతులు లేకుండా రోడ్లపైకి వస్తోంది జగనేనా అని ప్రజలు నివ్వెరపోతున్నారు.
ప్రజా జీవనానికి ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశంతో సూచించిన నిబందనలను బేఖాతరు చేస్తూ, రాజకీయ నినాదాలు.. బలప్రదర్శనలే లక్ష్యంగా పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న పర్యటనలు ప్రజలకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. జగన్ కావాలనే పోలీస్ నిబంధనలు, ప్రభుత్వ యంత్రాంగం సూచనలు ధిక్కరిస్తున్నాడని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
