TEJA NEWS

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని యాదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మొత్తం కాలిపోయింది. ఇలా చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


TEJA NEWS