TEJA NEWS

నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన జపానీ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు

సేంద్రియ వ్యవసాయంతో – ప్రతి రైతు ఆర్థికంగా బలపడాలి

-డాక్టర్ అశోక్ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త

మల్దకల్ స్పీడు స్వచ్ఛంద సేవా సంస్థ వారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు దత్తతను తీసుకున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం నాగరుదొడ్డి గ్రామానికి జపాన్ దేశంకు చెందినటువంటి జపానీ యూనివర్సిటీ నుండీ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మరియు సేంద్రియ వ్యవసాయ సాగు గురించి తెలుసుకోవడం కొరకు గ్రామాని సందర్శించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం గురించి తెలియచేయడానికి .హైదరాబాద్ నుండి వచ్చినటువంటి సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ అశోక్ తెలియజేస్తూ సేంద్రియ వ్యవసాయం చేయడం చాలా సులభ పద్ధతి మరియు తక్కువ పెట్టుబడితో సేంద్రియ వ్యవసాయంను చేయవచ్చు, సేంద్రియ వ్యవసాయం చేయడం వలన రైతులు తక్కువ పెట్టుబడి ఉంటుంది మరియు రాబడి ఎక్కువగా ఉంటుంది రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరం ఉండదు. అధిక రసాయన ఎరువులు మరియు అధిక క్రిమిసంహారక ఎరువులు వాడడం వలన వ్యవసాయ భూమిలోని పోషకపదార్థాలు తేమ శాతం దెబ్బతింటుంది రైతులకు పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. పూర్వకాలము భారత దేశంలో వ్యవసాయంను ఆవు పేడ, ఆవు మూత్రంతో , వానపాములతో, ఆకులతో సేంద్రియ ఎరువులుగా మార్చుకొని సేంద్రియ వ్యవసాయని మన పూర్వీకులు పెద్దలు, సాగు చేసేవారు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటలు శ్రేష్టమైనవి మరియు మానవ మనుగడకు ఎలాంటి ముప్పు వాటిలేది కాదు కనుక ప్రతి రైతు రసాయన ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను వాడకుండగా సేంద్రియ వ్యవసాయంను సాగు చేసుకోవాలని ప్రతి రైతు ఆర్థికంగా బలపడాలని తెలియజేసినారు జపాని యూనివర్సిటీ విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులు గురించి తెలియజేసి క్షేత్రస్థాయిలో నాగర్ దొడ్డి గ్రామం రైతులు సాగు చేస్తున్నటువంటి ఆర్గానిక్ పత్తిపొలాలను చూయించడం జరిగినది. విద్యార్థులు రైతులతో మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో విద్యార్థుల టీం లీడర్ ఇనాగాకి, వివాసకి, డాక్టర్ అరుణ్ , స్పీడు సంస్థ అధ్యక్షులు రవి ప్రకాష్, గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన జపానీ యూనివర్సిటీ  విద్యార్థులు

TEJA NEWS