మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

TEJA NEWS

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు స్కైరూట్‌ సంస్థ సువర్ణావకాశం

న్యూఢిల్లీ :
అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళా ఇంజనీర్ల కోసం హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ సంస్థ సువర్ణావకాశాన్ని కల్పించింది.

అర్హత గల వారికి ఒక ఏడాది పాటు తమ సంస్థలో వేతనంతో కూడిన కల్పనా ఫెలోషి్‌పను అందించడంతో పాటు, దాన్ని విజయవంతంగా పూర్తిచేసిన వారికి తమ సంస్థలోనే ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అంతరిక్ష రంగంలోకి రావాలని కోరుకునే మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకే తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ సీఈవో పవన్‌ చందనా చెప్పారు.

అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి ఆమె పేరు పెట్టినట్లు తెలిపారు. అర్హులైన వారు తమ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సంస్థ సహ వ్యవస్థాపకులు భారత్‌ ధాకా చెప్పారు. ఇంజనీరింగ్‌ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు

Print Friendly, PDF & Email

TEJA NEWS