TEJA NEWS

డిసెంబర్ 29న నిర్వహించనున్న శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణం, 19 జనవరి 2025 నుండి నిర్వహించనున్న కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్ల పై అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ సెక్రటేరియట్ లో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ,సిద్దిపేట ఆర్డివో, కొమురవెల్లి ఆలయ ఏఈఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


TEJA NEWS