124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ పెద్ద మనుషులతో సమావేశమై కాలనీ సమస్యల మీద పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమలమ్మ కాలనీలో కొంతమేర డ్రైనేజీ లైన్ మరియు సీసీ రోడ్లు పెండింగులో ఉన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విద్యుత్ కు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ లో పెండింగ్ ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్లను అతిత్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మనందరం కృషి చేయాలని కాలనీ వారిని కోరారు. కాలనీ వాసులందరు కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాండుగౌడ్, వాసుదేవరావు, గణేష్, జాన్, వెంకటేష్, విక్రమ్, రాజు మరియు కమలమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు.
124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…