కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు'(సీబీఐ ప్రత్యేక కోర్టు) తీర్పు ఇచ్చింది. ఇవాళ్టితో ఆమె సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించలేదు. కవిత అరెస్ట్ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కవితకు మరో బిగ్ షాక్ తగిలింది
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…