నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్
కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్
ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు
అధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకు
CBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడీ
పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ
నేపథ్యంలోనే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె
కోర్టు ముందు హాజరుకానున్నారు.