TEJA NEWS

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్రవు, తలసాని తదితరులు ఉన్నారు. మారేడ్పల్లి హిందూ శ్మశానవాటికలో లాస్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


TEJA NEWS