TEJA NEWS

బెయిల్‌పై బయటకొచ్చి ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింజ్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్‌ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ఆయన ఆదివారం ప్రకటించారు. ఇందులో చైనా ఆక్రమణలో ఉన్న భారత భూమి విముక్తితో సహా పలు ఉచిత పథకాలను ప్రకటించారు. వీటిలో 24 గంటల ఉచిత కరెంట్, ఉచిత వైద్యం వంటివి ఉన్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం వంటి పార్టీలు ఇండియా కూటమి పేరిట ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ప్రచారం చేస్తోంది.

కేజ్రీవాల్ 10 గ్యారెంటీలు ఇవే..

24 గంటల ఉచిత కరెంట్, అందరికీ ఉచిత విద్య, ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం (మొహల్లా క్లినిక్‌), చైనా ఆక్రమిత భారత భూమి విముక్తి, అగ్నివీర్ పథకాన్ని నిలిపివేస్తాం, రైతులకు ఎమ్మెస్పీ అందజేత, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, అవినీతిని అంతం, జీఎస్టీ వ్యవస్థ సరళీకృతం.. ఇవే కేజ్రీవాల్ ప్రకటించిన 10 గ్యారెంటీలు.


TEJA NEWS