TEJA NEWS

కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి రోడ్డు ప్రమాదం?

కేరళ:
ప్రకృతి అందాలతో దర్శన మిచ్చి కేరళ రాష్ట్రంలో వికృతి బీభత్సం సృష్టించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న వయనాడ్‌కు బయలుదేరిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఈ ఘటనలో గాయపడిన ఆమె ప్రస్తుతం మంజేరిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల లో చికిత్స పొందుతున్నా రు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంజేరిలో తొలుత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఆపై ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటన లో ఆమె ముఖం, చేతులకు స్వల్పంగా గాయాలు అయి నట్లు తెలిసింది, కోలుకున్న అనంతరం ఆమె వయనాడ్ వెళ్లే అవకాశం ఉంది.

ఈ ఘటనలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడికి కూడా చికిత్స అందిస్తు న్నారు. కాగా, కొండచరి యలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ప్రస్తుతం ఈ సంఖ్య 153కు చేరుకోగా, ఇంకా 98 మంది జాడ తెలియరాలేదు. గాలిం పు చర్యలు కొనసాగు తున్నాయి..


TEJA NEWS