TEJA NEWS

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య టెన్షన్‌ లో ఉన్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఈ కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్ వే పై నిలిచిపోయింది విమానం.

ప్రయాణికుల్లో రెవిన్యూ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు…


TEJA NEWS