కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజిపి శ్రీ సత్యనారాయణ ఐపిఎస్ .
కోదాడ సూర్యాపేట జిల్లా :
సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం.
శ్రీ. సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II.
కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇన్స్పెక్షన్ కు వచ్చిన ఐజి శ్రీ సత్యనారాయణ ఐపీఎస్ కి జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి, మునగాల, హుజూర్నగర్ సీఐ లు పుష్పగుచ్చం ఇచ్చి వందనంతో స్వాగతం తెలిపారు. ముందుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిశీలించి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యాలయం నందు నిర్వహిస్తున్న పలు రికార్డ్స్ తనకి చేసి సలహాలు అందించారు. రికార్డ్స్ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన భౌగోళిక మ్యాప్స్, నేరాలకు సంబంధించి హిస్టరీ షీట్స్, నేరాల నమోదు లను పరిశీలించినారు. కేసులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలని సూచించారు. అనంతరం సబ్ డివిజన్ లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సై లతో సమావేశం నిర్వహించడం జరిగింది. కోదాడ సబ్ డివిజన్ ఎక్కువగా ఆంధ్ర సరిహద్దు కలిగి ఉన్నందున సిబ్బంది అందరూ సమాచారం సేకరిస్తూ టీం వర్క్ చేయాలని ఆదేశించారు. ఇక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే సమాచారం వచ్చేలాగా సమాచార వనరులు బలోపేతం చేసుకోవాలని అన్నారు. అక్రమ రవాణాలను నివారించడం కోసం పటిష్టంగా పనిచేయాలని చెక్పోస్టుల వద్ద ఆ ప్రమత్తంగా ఉండాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం రానున్న సందర్భంగా సరిహద్దు ప్రాంత అధికారులతో సమన్వయంతో పని చేస్తూ అక్రమ రవాణాను నిరోధించాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది అని కార్యాలయంలో రికార్డ్స్ నిర్వహణ, పోలీసింగ్ నిర్వహణ సక్రమంగా జరుగుతున్న అని సిబ్బందిని, సి ఐ రజిత రెడ్డి ను అభినందిస్తున్నాను అన్నారు, సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్నంది, సన్న ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నందున మన రాష్ట్రం లోకి ఆంధ్రా నుండి వరిదాన్యం రాకుండా కృషి చేస్తున్నాము అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా పని చేస్తూ ఆంధ్రా వైపు నుండి ఇక్కడికి వరి ధాన్యం రాకుండా రైతులకు అండగా పని చేస్తున్నాము అన్నారు. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా కృషి చేస్తున్నాము, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పై కేసులు నమోదు చేసి బారుగా బియ్యం స్వాధీనం చేసుకున్నాము, తరచుగా పిడిఎస్ బియ్యం అక్రమ దందా కు పాలడుతున్న నర్సింహారావు, జగదీష్ అనే నిందితులపై పీడి యాక్ట్ పెట్టడం జరిగినది అన్నారు. పిడిఎస్ బియ్యం దందా చేస్తున్న వారిని గుర్తించి సూర్యాపేట జిల్లాలో ఈరోజు మరో 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము అన్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు నుండి పెద్ద మొత్తంలో వస్తున్న గంజాయి నిరోధించడం, పోలీసు నిఘా బాగా పెరిగి పెద్దమొత్తంలో తరలించే గంజాయి సీజ్ చేస్తున్నందున నేరస్తులు గంజాయిని కొద్ది మొత్తంలో బైక్ లపై తరలిస్తున్నారు ఇలాంటి దాయినిపై మరింత నిఘా ఉంచాం అన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు. అక్రమ కార్యకలాపాలను, అక్రమ రవాణాను పటిష్టంగా నిర్ములిస్తాం అని ఐజి తెలిపినారు.
ఐజి గారి వెంట అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, హుజూర్నగర్ సిఐ చరమంద రాజు, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, సబ్ డివిజన్ స్టేషన్ ల ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.