కొడకంచి బీఆర్ఎస్ ఎంపీటీసీ సంతోష మహేష్  కాంగ్రెస్ పార్టీలో చేరిక

కొడకంచి బీఆర్ఎస్ ఎంపీటీసీ సంతోష మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

TEJA NEWS

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి: కాట శ్రీనివాస్ గౌడ్

కొడకంచి ఎంపీటీసీ సంతోష మహేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజా పాలన సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఎంపీటీసీ జనాభాయి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ వడ్డె క్రిష్ణ, నర్సింలు, మహేష్ గౌడ్, అజారుద్దీన్, రవీందర్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS