TEJA NEWS

ప్రత్యేక అలంకరణలో సీతా రాములు*
_ రామ నామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయం*


సూర్యాపేట సాక్షిత : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కొలువు దీరిన శ్రీ విజయాంజనెయ స్వామి ఆలయంలోశ్రీ సీతారాముల పట్టాభిషేకం ఘనంగా జరిగింది.ఆలయ అర్చకులు మరింగoటి వరదా చార్యులు సీతారాములకు పంచామృత అభిషేకం నిర్వహించి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు.తదుపరి సహస్ర నామార్చన చేసి సీతారాముల పట్టాభిషేక క్రతువు నిర్వహించారు.భక్తుల రామ నామ స్మరణతో దేవాలయం మారు మ్రోగింది.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు, మరింగంటి శ్రీదేవి, ముడుంభై సారిక,ఆలయ ట్రస్టీ ఛైర్మెన్ కొప్పుల కరుణాకర్ రెడ్డి పద్మ,ఆదినారాయణ పద్మ,వెన్న శ్రీనివాస రెడ్డి కవిత,మాధవి,శ్రీదేవి,రజిత,ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్త బృందం పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


TEJA NEWS