TEJA NEWS

గర్ల్స్ హాస్టల్ కోసం ఎలాంటి అధికారం లేని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కలిసిన జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం

త్వరలో బోర్డు అఫ్ ఇంటర్ మీడియట్ కు కంప్లైంట్ చేస్తాం
(ఎస్ ఎఫ్ ఐ )సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదలా రంజిత్ రెడ్డి

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి వినతిపత్రం ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు పక్క జిల్లా జనగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి వినతిపత్రం ఇవ్వడం అంటే అధ్యాపకులు రాజకీయాలు చేస్తున్నారా లేక విద్యాభోదనలు చేస్తున్నారని అని(ఎస్ ఎఫ్ ఐ )సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం లో అన్నారు
హాస్టల్ కోసంమే అయితే గత సంవత్సరం ( ఎస్ ఎఫ్ ఐ )ఆధ్వర్యంలో హాస్టల్ కోసం కొట్లాడి సాధించామని కానీ ఏ ఒక్కరిని కూడా అధ్యాపక బృందం అడ్మిషన్ చేపించలేదని దాని కారణం గా అడ్మిషన్స్ రాలేదని హాస్టల్ ప్రారంభం కాలేదని, ఇప్పుడు పోయి ఎలాంటి అధికారాలు లేని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వద్దకు పోయి హాస్టల్ కావాలి అని కాలేజీ సమయంలో కాలేజీలో ఉండకుండా ఇంటికి వెళ్లి హాస్టల్ కావాలి అని అడగడం సరిఅయిన పద్ధతి కాదని విరిపైన బోర్డు అఫ్ ఇంటర్ మీడియట్ అధికారులకు పిర్యాదు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో (ఎస్ ఎఫ్ ఐ )చేర్యాల డివిజన్ ఉపాధ్యక్షుడు తడూరి భరత్ కుమార్ నాయకులు రాకేష్ అనిల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS