Spread the love

కొంపల్లి దుర్గమ్మ మహంకాళి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మేల్యే కె.పి.వివేకానంద ..

ఈ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులోని దుర్గమ్మ ఆలయంలో ఘనంగా నిర్వహించిన దుర్గమ్మ మహాకాళి కళ్యాణోత్సవం వేడుకలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొంపల్లి ప్రజల శాంతి, సమృద్ధి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం భక్తులతో మాట్లాడిన ఆయన, “ఇటువంటి భక్తి కార్యక్రమాలు ప్రజల మనోభావాలకు శక్తినిచ్చేలా, సమాజంలో సానుకూల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ఉంటాయి” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, మాజి కౌన్సిలర్ జంధా మంజుల కుమార్ గౌడ్, కృష్ణా గౌడ్, లక్ష్మణ్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..