TEJA NEWS

వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరిక
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా
శంకర్‌పల్లి:
పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ 14వ వార్డుకు చెందిన వై సతీష్ రెడ్డి, బి హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా, ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన యువకులందరికీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కెఎస్ రత్నంలు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల లొ పార్టీలకు అతీతంగా బీజేపీ అభ్యర్థి కొండ విశ్వశ్వర్ రెడ్డి ని గెలిపించాలని అన్నారు.

వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి లు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టడం తద్యం అన్నారు. అదే స్ఫూర్తితో కొత్త పాత అనే భేదం లేకుండా పనిచేసి చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తామని భరోసా ఇచ్చారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డిని రెండు లక్షల భారీ మెజార్టీతో గెలిపించి రెండోసారి పార్లమెంటుకు పంపుతామని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ గౌడ్, మల్లికార్జున గౌడ్, నాయకులు సుధాకర్ రెడ్డి ఉన్నారు.


TEJA NEWS