ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య
*దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం
*సర్వే లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తిచేస్తాము
శంకరపల్లి : :మోకిల మరియు కొండకల్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను సోమవారం ప్రారంభించారు. మోకిల మరియు కొండకల్ గ్రామాలలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్యంగా దళిత బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే వసతిని కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకంను ప్రారంభించారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు గృహాల నిర్మాణం చేపట్టబడుతోంది. ముఖ్యంగా, ఈ పథకం నడపడానికి బలమైన మద్దతు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రాముఖ్యతనిచ్చారు .ఈ పథకం ద్వారా దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం లక్ష్యంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య, సంతోష్, రాణి , తదితరులు పాల్గొన్నారు