
బాధితుడికి చికిత్స ఎల్ఓసి ( LOC) ని అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
హన్మకొండ జిల్లా… గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ తిమ్మాపూర్ రాంగోపాలపురం గ్రామానికి చెందిన ఎడ్ల నరసింహ రామయ్య గుండె శస్త్ర చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్ లో చేరడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారికి చికిత్స కొరకు 2,00,000 రూపాయల ఎల్ఓసి (LOC) మంజూరు చేయించి ఎమ్మెల్యే హన్మకొండ సుబేదారిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యునికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎల్ఓసి (LOC)కాపీ అందజేశారు…
ఈ సందర్భంగా చికిత్స కొరకు ఎల్ఓసి (LOC) మంజూరు చేయించిన ఎమ్మెల్యే నాగరాజు కి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..
