ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 24న ఆదిలాబాద్ లో చేపట్టనున్న కార్యక్రమంలో పాల్గోనున్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని తెలిపారు మాజీమంత్రి జోగు రామన్న.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అ న్నారు. అధికారంలోకి వచ్చిన 300 రోజుల్లో 300మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ శంఖారావం పూరించనున్నారని, ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో పార్టీ నాయకులు రమేశ్, అజయ్, నారాయణ, వేణుగోపాల్ యాదవ్, పాల్గొన్నారు