ఇక నుంచి కేటీఆర్ టాపిక్ !
అల్లు అర్జున్ ఇష్యూకు క్రిస్మస్ తో దాదాపుగా తెరపడినట్లే. ఇక నుంచి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసు బయటకు వస్తోంది. ఏసీబీ తన పని ప్రారంభించింది. ముందుగా ఫిర్యాదు దారు అయిన దానకిషోర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఇదంతా ఫార్మాలిటీ. ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు జారీ చేయబోతున్నారు.
క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పది రోజులు అరెస్టు చేయవద్దని చెప్పింది కానీ విచారణ మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అంటే తదుపరి విచారణలో కూడా క్వాష్ కు అవకాశం లేదు. విచారణ కొనసాగుతుంది. అరెస్టు నుంచి రిలీఫ్ పొడిగిస్తారా లేదా అన్నది కూడా తేలుతుంది. దానితో సంబంధం లేకుండా ఏసీబీ విచారణ కొనసాగుతుంది.కేటీఆర్ కు ఇవాళో..రేపో నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయి. తమ ఎదుట హాజరయ్యేందుకు ఎక్కువ సమయం కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు.
రెడీగా ఈడీ కూడా ఉంది. ఈడీ కూడా సమాంతరంగా నోటీసులు జారీ చేసే చాన్సులు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరి ఎదుట కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక నుంచి అదే మ్యాటర్ మీడియాలో హైలెట్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ మ్యాటర్ ను లైవ్ లో ఉంచేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఎంత వర్కవుట్లు అవుతుందో వేచి చూడాలి.