మహబూబ్ నగర్ జిల్లా :
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
పాఠశాలలో మొత్తం 67 మంది విద్యార్థులకు కేవలం ఒక్క ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాద్యాయు డు మాత్రమే ఉన్నారని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సకాలంలో పాఠశాలకు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయు లను నియమించాలని విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు…