భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించి.. భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
నందివాడ మండలం పోలుకొండలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే… ప్రజల నుండి భూ సమస్యల అర్జీలు స్వీకరణ
ప్రజలకు మంచి చేసేందుకే సీఎం చంద్రబాబు ప్రాధాన్యత: ఎమ్మెల్యే
నందివాడ :గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని.. ప్రజలకు మంచి చేసేందుకే సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము పేర్కొన్నారు.
నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో కూటమి నాయకులు.. అధికార యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు మరియు ప్రజల నుండి స్వీకరించిన భూ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము పరిశీలించారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తుందని.. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
రెవెన్యూ సదస్సుల రూపంలో ప్రభుత్వం ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందన్నారు. ఏపీలో ప్రజలకు ఉన్న ప్రధాన సమస్యల్లో భూ సమస్యని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను వాళ్ల స్వలాభం కోసమే చేసుకున్నారని విమర్శించారు. భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము అన్నారు.
రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు,గ్రామ పార్టీ అధ్యక్షుడు కుర్మా శ్రీనివాసరావు, సర్పంచ్
మానేపల్లి ఝాన్సీ కుమారి, తాసిల్దార్ గురుమూర్తి రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ కిరణ్, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటరావు, ఆర్.ఐ. గణేష్, సర్పంచ్ సుబ్బారావు,మండల పార్టీ నాయకులు లక్ష్మీ వరపు శ్రీనివాసరావు,అరికపూడి రామశాస్త్రి, ఉప్పల వెంకటేశ్వరరావు, చాట్రగడ్డ రవి , తమ్మారెడ్డి శ్రీనివాసరావు, బాబ్జి,మీగడ ప్రేమ్ కుమార్, గుత్తికొండ నరసింహారావు, బొర్రా శ్రీనివాసరావు, ఐటీడీపీ కూచిపూడి అజిత్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.