దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి

TEJA NEWS

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి…జయలలిత 27 కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగింత..బెంగళూరు కోర్టు కీలక తీర్పు..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.

ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది.

అయితే తాజాగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి కీలక నిర్ణయం తీసుకుంది.

జయలలితకు చెందిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6, 7 తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు సోమవారం ప్రకటించింది

అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన దాదాపు పదేళ్ల తర్వాత, ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయడమే ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురానుంది.

20 కిలోల నగలను అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానా వసూలు చేయనుండగా, 7 కిలోలు ఆమె తల్లి నుంచి వారసత్వంగా వచ్చినవిగా భావించి మినహాయింపు ఇస్తారు. జయలలితకు ఖాతా ఉన్న కాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సోమవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు రూ.60 లక్షలను అందజేసింది. తాను గతంలో ఆదేశించిన విధంగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ (డీవీఏసీ) ఇన్స్పెక్టర్ జనరల్ బెంగళూరు కోర్టుకు వచ్చి బంగారు, వజ్రాభరణాలు స్వీకరించాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 16న జీవో జారీ చేసింది.

ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, అవసరమైన భద్రతతో ఆరు పెద్ద ట్రంకులను తీసుకురావాలని న్యాయమూర్తి చెప్పారు. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS