TEJA NEWS

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.
లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం కంటే గొప్ప మార్గం ఏముందని ట్విట్టర్‌ వేదికగా సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

ప్రియతమ నాయకుడు కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా, ఆయన మార్గదర్శక నాయకత్వానికి కృతజ్ఞతగా, గౌరవానికి చిహ్నంగా ఉండే వృక్షార్చన ఉద్యమాన్ని ప్రజలంతా ఆదరించాలని కోరారు. పెరుగుదల, జీవితం, స్థిరత్వానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు సహకరించాలని కోరారు. మొక్కలు నాటి సహచరులతో గర్వంగా సెల్ఫీ తీసుకుంటూ, మార్పు క్షణాన్ని సంగ్రహించాలని విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS